News September 8, 2025
జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇద్దరు పారా మిలిటరీ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, J&K పోలీసులు, శ్రీనగర్ CRPF దళం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Similar News
News September 9, 2025
గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

TG: గ్రూప్-1 వ్యవహారంపై హైకోర్టు ఇవాళ ఏం తీర్పు ఇవ్వనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేయగా, పరీక్షలను రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు చెప్పనుంది. గ్రూప్-1 అంశం కోర్టులో ఉండటంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది.
News September 9, 2025
ఇవాళ భారీ వర్షాలు

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న వైజాగ్, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు కోస్తా జిల్లాలు NTR, బాపట్ల, ప్రకాశం, నెల్లూరులో ఎండలు దంచికొడుతున్నాయి. 38.8డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
News September 9, 2025
డిమాండ్‌లు నెరవేర్చకపోతే కాలేజీలు మూసివేస్తాం: APPDCMA

AP: పెండింగ్‌లో ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేదంటే కాలేజీలను నిరవధికంగా మూసివేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. 2023-24, 2024-25 అకడమిక్ ఇయర్స్‌కు సంబంధించిన ఫీజులు పెండింగ్‌లో ఉండటం వల్ల యాజమాన్యాలపై భారం పడుతోందని పేర్కొంది. కోర్సుల ఫీజులను కూడా సవరించాలని, 2014-19లో ఉన్న విధానాలను అమలు చేయాలని కోరింది.