News September 8, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News September 9, 2025

ఏది కొనాలన్నా 22 తర్వాతే..

image

ఈనెల 22 తర్వాత GST కొత్త <<17605492>>శ్లాబులు<<>> అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో ‘ఏది కొనాలన్నా ఆ తర్వాతే’ అని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST పూర్తిగా ఎత్తేయడంతో ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా 22 తర్వాతే ఆఫర్లను అమలు చేయనున్నాయి.

News September 9, 2025

గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

image

TG: గ్రూప్-1 వ్యవహారంపై హైకోర్టు ఇవాళ ఏం తీర్పు ఇవ్వనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేయగా, పరీక్షలను రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు చెప్పనుంది. గ్రూప్-1 అంశం కోర్టులో ఉండటంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది.

News September 9, 2025

ఇవాళ భారీ వర్షాలు

image

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న వైజాగ్, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు కోస్తా జిల్లాలు NTR, బాపట్ల, ప్రకాశం, నెల్లూరులో ఎండలు దంచికొడుతున్నాయి. 38.8డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.