News September 8, 2025

గణేష్ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: కలెక్టర్

image

నిర్మల్‌ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ముగిశాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శోభాయాత్రకు అన్ని శాఖలు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం పూర్తయిందని ఆమె అభినందించారు. సహకరించిన పోలీస్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖలకు, గణేష్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 8, 2025

జనగామ కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల నిరసన

image

జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్లలో పనిచేస్తున్న ANMలు ఈరోజు నిరసన చేపట్టారు. ఏఎన్ఎంల జనగామ జిల్లా అధ్యక్షురాలు కొండ్ర లత మాట్లాడుతూ.. ఏఎన్ఎంల మొబైల్ యాప్‌లలో ఆన్‌లైన్ వర్క్ ‌వల్ల కలిగే పని ఒత్తిడిని తగ్గించాలని, ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, AITUC నాయకులు పాల్గొన్నారు.

News September 8, 2025

జనగామ కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ధర్నా

image

జనగామ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఈరోజు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 కూలి కల్పించాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.

News September 8, 2025

హనుమకొండ కలెక్టరేట్ ముట్టడి

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ను దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నేతలు ఈరోజు ముట్టడించారు. దివ్యాంగులకు చేయూత పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా దివ్యాంగులకు పింఛన్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్‌దారులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.