News September 8, 2025
WGL: ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర..!

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,580 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,530కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
Similar News
News September 9, 2025
NLG: తుది ఓటరు జాబితా విడుదలకు కసరత్తు!

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33 మండలాల్లో 33 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.
News September 9, 2025
హైదరాబాద్‌లో పోలీస్ క్రికెట్ స్టేడియం..!

హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో కొత్త క్రికెట్ స్టేడియం రానుంది. పోలీస్ క్రికెట్ స్టేడియం (పీసీఎస్) నిర్మాణంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీని కోసం అంబర్‌పేట, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఆరాంఘర్‌లో స్టేడియం నిర్మిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పీసీఎస్‌ను క్రికెట్ ఆడుకునే వారికి అద్దెకు ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.
News September 9, 2025
బాసర ఆర్జీయూకేటీలో పట్టభద్రుల యోగ్యత శిక్షణ గేట్ తరగతులు ప్రారంభం

యంత్రశాస్త్ర పోటీ పరీక్షల సాధనా పరిషత్(ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ) సహకారంతో యంత్రశాస్త్ర పట్టభద్రుల యోగ్యతా పరీక్ష(గేట్))అంతర్జాల శిక్షణా తరగతులను బాసర ఆర్జీయూకేటీలో కళాశాల వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మాణాత్మక గేట్ శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఏ.సీ.ఈ అకాడమీ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారన్నారు.