News September 8, 2025

సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి: వరంగల్ సీపీ

image

ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 56 కేసులు నమోదు కాగా.. ఇందులో 50 ఫైనాన్స్ కేసులు, 6 నాన్ ఫైనాన్స్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. చాలా వరకు చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నట్లు తెలిపారు. ఎవరైనా మోసపోతే తక్షణమే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News September 8, 2025

మెదక్: ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైంది: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని పేర్కొంటూ, ఓటరు జాబితాపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు.

News September 8, 2025

రైతులందరికీ ఎరువుల సరఫరా చేస్తాం: మంత్రి అచ్చెన్న

image

రైతులందరకీ ఎరువులు సరఫరా చేస్తామని, ఎటువంటి అపోహలు వద్దని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస రైతు సేవా కేంద్రంలో రైతులకు ఎరువుల పంపిణీ చేశారు. ఇప్పటికే సచివాలయాలకు ఎరువులు చేరాయని, మరో 3 వేల మెట్రిక్ టన్నులు యూరియా వారం రోజుల్లో రానుందని తెలియజేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 8, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: KMR కలెక్టర్

image

జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, రేషన్ కార్డు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జీపీఓలకు మంగళవారం లోగా గ్రామాలు కేటాయిస్తామని తెలిపారు.