News September 8, 2025
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం(సిరిసిల్ల జిల్లా), కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం(సిద్దిపేట), రామప్ప రామలింగేశ్వరస్వామి గుడి(ములుగు), కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం(JS భూపాలపల్లి), రుద్రేశ్వర ఆలయం-వేయి స్తంభాల గుడి(హన్మకొండ), పానగల్ ఛాయా సోమేశ్వరాలయం(నల్గొండ), కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం(మేడ్చల్-మల్కాజిగిరి), ఐనవోలు మల్లన్న స్వామి ఆలయం(వరంగల్), జడల రామలింగేశ్వరస్వామి ఆలయం(నల్గొండ).
Similar News
News September 9, 2025
నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
News September 9, 2025
కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల పూజలు.. పిక్స్ వైరల్

డేటింగ్ రూమర్స్ వేళ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ ఇంట్లో హీరోయిన్ శ్రీలీల వినాయక చవితి పూజలు చేశారు. ఈ వేడుకలకు శ్రీలీల తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కార్తీక్-శ్రీలీల కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు.
News September 9, 2025
రివర్స్ వాకింగ్ చేస్తే ప్రయోజనాలు ఇవే!

రివర్స్ వాకింగ్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘వెనక్కి నడవడం వల్ల ముందుగా కాలి వేళ్ల భాగం, ఆ తర్వాత పాదం మొత్తం నేలకు ఆనుకుంటుంది. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అయ్యి బరువు తగ్గొచ్చు. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్ను నొప్పి, మెడనొప్పి, గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది’ అని చెబుతున్నారు.