News September 8, 2025
విటమిన్ల కోసం ఇవి తినండి!

విటమిన్ A- క్యారెట్లు, కాలేయం. B1 – తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2 – పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశనగ. B5 – అవకాడో, గుడ్లు. B6 – అరటిపండు, సాల్మన్ చేప, ఆలుగడ్డలు. B7 – గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B9 – ఆకుకూరలు, పప్పులు, సిట్రస్. B12 – చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. విటమిన్ D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్. E – పొద్దుతిరుగుడు గింజలు, బాదం. C – నారింజ, జామ. SHARE IT
Similar News
News September 9, 2025
RECORD: తొలిసారి రూ.లక్ష దాటిన 22 క్యారెట్ గోల్డ్ రేటు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో చరిత్రలో తొలిసారి 24 క్యారెట్ల బంగారం రూ.1.10లక్షలు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10g పసిడి ధర రూ.1,360 పెరిగి రూ.1,10,290కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1250 ఎగబాకి రూ.1,01,100 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 9, 2025
CDFDలో జాబ్స్.. దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, బీఈ, పీజీ, డిప్లొమా, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
News September 9, 2025
నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.