News September 8, 2025

వెంకటగిరి జాతర.. ఈ స్వీట్‌ టేస్ట్ చూడండి!

image

వెంకటగిరి అనగానే గుర్తుకు వచ్చేది పోలేరమ్మ జాతర, చీరలు. అయితే మరో రుచికరమైన స్వీట్ కూడా ఉంది. అదే వందేళ్ల పైగా చరిత్ర కలిగిన కమలమ్మ మైసూర్ పాక్. జీడిపప్పు, స్వచ్చమైన నెయ్యి, చక్కరతో జీడిపప్పు మైసూర్ పాక్ తయారు చేస్తున్నారు. దీనిని కమలమ్మ తయారీ చేయడంతో కమలమ్మ మైసూర్ పాక్ లేదా వెంకటగిరి జీడిపప్పు మైసూరు పాక్ అని పిలుస్తారు. వెంకటగిరిలో ఈ స్వీట్ రుచి మీరు చూశారా?

Similar News

News September 9, 2025

నంద్యాలలో చంద్రబాబు అరెస్టు.. నేటికి రెండేళ్లు

image

‘చంద్రబాబు అరెస్టు కాబోతున్నారంట..’ దేశవ్యాప్తంగా ఉత్కంఠ చర్చ. ఓ రాత్రంత్రా హైడ్రామా నడిచి ఎట్టకేలకు ఆయనను అరెస్టు చేసి విజయవాడ తరలించారు. చంద్రబాబు నంద్యాలలో 2023 సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9వ తేదీ తెల్లవారుజామున అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో పోలీసులు స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేశారు. నేటికి రెండేళ్లు.

News September 9, 2025

లోకో పైలట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌పై నెట్టింట చర్చ

image

లక్షలాది ప్రయాణికుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే లోకో పైలట్ నియామకంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. సిగ్నల్స్, రూట్స్, ఇంజిన్ నియంత్రణకు బాధ్యత వహించే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్‌ను తక్కువ మార్కులొచ్చిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లో URకు 66.66 మార్కులు కట్ఆఫ్‌గా ఉంటే BC & EWSలకు 40, SCలకు 34, STలకు 25 మార్కులు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్?

News September 9, 2025

పిల్లలు వెళ్లాల్సింది బడికి.. పనికి కాదు: వరంగల్ పోలీసులు

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు. ‘పిల్లలు వెళ్లాల్సింది బడికి.. పనికి కాదు’ అనే సందేశంతో అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. బాలల హక్కులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాలకార్మికులపై సమాచారం లభిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కి చెప్పాలరి పోలీసులు కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.