News September 8, 2025
పెద్దపల్లి: NSEP 10న స్థానిక సంస్థల ఓటర్ జాబితా విడుదల

PDPL స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు సెప్టెంబర్ 8 సాయంత్రంలోపు సమర్పించాలన్నారు.
Similar News
News September 9, 2025
జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతులు

జగిత్యాల పాతబస్టాండ్ వద్ద ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభను కొండపల్లి సీతారామయ్య వర్గం వారు 1978 SEP 9న ఏర్పాటు చేశారు. ఈ సభను ఉమ్మడి KNR, ADB, NZB, WGL జిల్లాల రైతు కూలీ సంఘాల వారి ఆధ్వర్యంలోనే నిర్వహించారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, వెట్టి నిర్మూలన కోసం, దున్నేవాడిదే భూమి, వ్యవసాయ కూలీల ధరలు పెంచాలని డిమాండ్లతో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు గ్రామాల్లో ప్రచారంచేశారు.
News September 9, 2025
జైత్రయాత్రకు ముందు నుంచే జగిత్యాలతో గద్దర్‌కు అనుబంధం

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్ జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వెల్గటూరు, బీర్‌పూర్, సారంగపూర్ ప్రాంతాల్లో పర్యటించారు. మలిదశ ఉద్యమంలో ధూంధాం పేరిట పలు బహిరంగ సభలకు గద్దర్ హాజరై పాటలు పాడి ప్రసంగించారు. పలుసార్లు జగిత్యాలకు వచ్చిన గద్దర్ జైత్రయాత్రకు కేంద్రమైన జగిత్యాలను మరిచిపోలేనని భూమాతను ముద్దాడి, జగిత్యాల ఉద్యమ మట్టిని మూటగట్టి గద్దర్ వెంట తీసుకెళ్లాడు.
News September 9, 2025
మావోయిస్టు ఉద్యమాలకు ఊపిరందించిన జగిత్యాల జైత్రయాత్ర

జగిత్యాల జైత్రయాత్రతో రైతు కూలీ సంఘాలు పీపుల్స్‌వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి భీజం వేసింది. ఈ జైత్రయాత్ర వేదికపై మావోయిస్టు అగ్రనేతలు గణపతి, కిషన్ జీ, శీలం నరేశ్, కైరి గంగారం, గజ్జెల గంగారం, అంగ ఓదెలు, గద్దర్‌తో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. నాటి ఈ జైత్రయాత్ర నిర్వాహకులు ఎన్‌కౌంటర్‌లు, లొంగిపోవడం, ఇంకొందరు అడవిబాట పట్టారని మాజీలు చెబుతారు.