News September 8, 2025
నర్సంపేట: కలిసి కట్టుగా సరస్వతి నిలయాన్ని నిలబెట్టారు!

నర్సంపేట మండలంలో మారుమూల గ్రామమైన భోజ్యా నాయక్ తండాలో 15 ఏళ్ల కిందట సర్కారు బడి మూతపడింది. పక్క గ్రామాలకు వెళ్లలేక పలువురు విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపట్లేదని ఈ తండాకు చెందిన ఉద్యోగులు, యువకులు, రాజకీయ నాయకులు బడిని తెరిపించేందుకు ముందుకు వచ్చారు. తలా కొంత వేసుకొని రూ.లక్షలు వెచ్చించి ఈ ఏడాది తండాలో బడిని పున: ప్రారంభించారు. అక్షరాస్యత దినోత్సవం రోజున తండా వాసులను అభినందించక తప్పదు మరి..!
Similar News
News September 9, 2025
బీజేపీ స్టేట్ కమిటీపై ‘బండి’ గుస్సా

నూతనంగా ఏర్పాటైన BJP స్టేట్ కమిటీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. KNR పార్లమెంట్ పరిధిలో బండి ప్రతిపాదించిన పేర్లను విస్మరించడం ఆగ్రహానికి కారణమని సమాచారం. 2 MLC సీట్లతో పాటు 2 సార్లు MPగా గెలిపించిన KNRకు ప్రాతినిథ్యం లేకపోవడం పట్ల BJP శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ బేస్డ్‌గా స్టేట్ కమిటీ ఏర్పడిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
News September 9, 2025
తెలంగాణ భాషకు కాళోజీ కృషి: ADB కలెక్టర్

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, జిల్లా అధికారులు ఉన్నారు.
News September 9, 2025
అనకాపల్లి ఎంపీకి డిప్యూటీ స్పీకర్ లేఖ

అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్‌కు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామకృష్ణంరాజు లేఖ రాశారు. చెన్నై-విజయవాడ వందే భారత్ రైలు సర్వీసును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.