News September 8, 2025
చరిత్ర సృష్టించిన తెలంగాణ ఆర్చర్ చికిత

ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత రికార్డు సృష్టించారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్-21 ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించారు. TSలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తండ్రి ఆధ్వర్యంలోనే శిక్షణ పొందారు. ఈమె ఇప్పటికే పలుజాతీయస్థాయి పతకాలు సొంతం చేసుకున్నారు.
Similar News
News September 8, 2025
గాయం నుంచి కోలుకుంటున్న పంత్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఆయన అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గాయం నుంచి మరింత వేగంగా కోలుకునేందుకు పంత్ వైద్య నిపుణులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ విసిరిన బంతి పంత్ కాలికి బలంగా తగిలింది. దీంతో ఆయన విలవిల్లాడుతూ వెంటనే మైదానాన్ని వీడారు.
News September 8, 2025
టిక్ టాక్‌పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి

టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ యాప్‌ను మళ్లీ పునరుద్ధరించే ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాగా భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో టిక్ టాక్ యాప్ మళ్లీ ఇండియాలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఈ విధంగా స్పందించారు.
News September 8, 2025
నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు: కాజల్

తనకు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఫన్నీగా ఉంటాయని తెలిపారు. దేవుడి దయతో తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా రోడ్డు ప్రమాదంలో కాజల్‌కు తీవ్రగాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.