News September 8, 2025
HYD: అటు ఆనందం, ఇటు ఆర్తనాదం

అందరిదేమో ఆనందం.. కొందరిదేమో ఆర్తనాదం. బొమ్మ బొరుసు వలే ఈ రెండు ఉంటాయనడానికి పైఫొటో ఉదాహరణ. ఆదివారం ట్యాంక్‌బండ్ మీద నిమజ్జనోత్సవంలో కొన్ని దృశ్యాలు ఉత్సాహం నింపితే, మరికొన్ని గుండెను బరువెక్కించాయి. ఆటపాటల్లో మునిగిన సెక్రటేరియట్ ఎదుట మాసిపోయిన చీర, ఒంటినిండా గాయాలతో ఓ తల్లి భిక్షాటన చేసింది. దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడు దీనంగా చూస్తుండిపోయాడు. వారి బతుకు చిత్రం చూసి భక్తులు చలించిపోయారు.
Similar News
News September 9, 2025
HYD: అలా అయితే.. నిజంగా ఇది ‘భాగ్య’నగరమే.. !

మహానగర విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తోంది. 2050 నాటికి 31 రూట్లలో 662 KM మెట్రో రైళ్లు నడపాలని ముసాయిదా సిద్ధమైంది. నిజంగా ఇది అమలైతే.. నగర వాసికి ట్రాఫిక్ చిక్కులు తప్పినట్టే. త్వరలో 200 కిలోమీటర్లు, భవిష్యత్తులో 662 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తే నిజంగా ఇది ‘భాగ్య’నగరమే అవుతుంది.
News September 9, 2025
హైదరాబాద్‌లో పోలీస్ క్రికెట్ స్టేడియం..!

హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో కొత్త క్రికెట్ స్టేడియం రానుంది. పోలీస్ క్రికెట్ స్టేడియం (పీసీఎస్) నిర్మాణంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీని కోసం అంబర్‌పేట, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఆరాంఘర్‌లో స్టేడియం నిర్మిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పీసీఎస్‌ను క్రికెట్ ఆడుకునే వారికి అద్దెకు ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.
News September 9, 2025
మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.