News September 8, 2025
కలికిరికి మాజీ సీఎం రాక నేడు

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్తారన్నారు.
Similar News
News September 9, 2025
వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తికి రూ.7,530 ధర పలకగా.. ఈరోజు రూ.7,580కి చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
News September 9, 2025
ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సరైన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.
News September 9, 2025
విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.