News September 8, 2025

RGM: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని C&MD, డైరెక్టర్‌కు లేఖలు

image

సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంస్థ C&MDబలరాం, డైరెక్టర్ గౌతమ్ పోట్రుకు లేఖలు పంపినట్లు INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) సోమవారం తెలిపారు. ఈనెల 12న జరగబోయే కీలక సమావేశంలో ప్రధాన అంశాలను చర్చించి, ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ సాధించిన లాభాలలో 35% కార్మికులకు వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 9, 2025

JGTL: FLIPKARTలో జాబ్స్.. రూ.25,000ల జీతం!

image

JGTL జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రేపు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. FLIPKARTలో డెలివరీ బాయ్స్‌గా 20 ఖాళీలు ఉన్నాయని, SSC చదివి 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.20,000- రూ.25,000 వేతనం ఉంటుందన్నారు. వివరాలకు 7799284842 నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.

News September 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 9, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
✒ ఇష: రాత్రి 7.36 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 9, 2025

కరాటే పోటీల్లో రాయికల్ విద్యార్థులకు ‘GOLD’

image

కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాయికల్ ఎస్సై సుధీర్ రావు అన్నారు. కరీంనగర్లో జరిగిన 3వ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ కుంగ్ ఫూ అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో రాయికల్‌కు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరికి ఎస్సై పతకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కరాటే మాస్టర్ ప్రభాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.