News September 8, 2025

కలికిరికి మాజీ సీఎం రాక నేడు

image

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్తారన్నారు.

Similar News

News September 9, 2025

HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

image

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News September 9, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 19 రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 19 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపిన 3,124 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 9, 2025

10 పోస్టులకు APPSC నోటిఫికేషన్

image

AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.