News September 8, 2025
ఆస్ట్రేలియాలో ఈ వస్తువులకు నో ఎంట్రీ

మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి <<17646725>>నవ్య నాయర్<<>>కు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులు ఫైన్ విధించారు. అక్కడికి పువ్వులు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ముడి గింజలు, పాల ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామూన్, రస్ మలై, బియ్యం, టీ, తేనె, హోమ్ ఫుడ్, పెట్స్ ఫుడ్, పక్షులు, పక్షుల ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, మేపుల్ సిరప్ తీసుకెళ్తే రూ.1,54,316 వరకు ఫైన్ విధిస్తారు.
Similar News
News September 9, 2025
ALERT: ఇక ఎగ్జామ్ పేపర్స్ షేర్ చేస్తే జైలుకే!

అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. SM, ఆన్‌లైన్లో ఎగ్జామ్ పేపర్స్‌పై చర్చించడం, షేర్ చేయడం నేరమని తెలిపింది. ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అవకతవకలు నివారించడానికి కేంద్రం ఇటీవల పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జైలు శిక్ష, భారీ ఫైన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని SSC హెచ్చరించింది.
News September 9, 2025
10 పోస్టులకు APPSC నోటిఫికేషన్

AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <
News September 9, 2025
తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.