News September 8, 2025

JGTL: ‘పెట్రోల్ పంప్ ఏర్పాటుకు సహకరించండి’

image

జగిత్యాల పట్టణంలో ఓల్డ్ బస్టాండ్ సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎస్పీ అశోక్ కుమార్‌ను కోరారు. ఈ విషయంపై ఆయన వినతిపత్రం అందజేశారు. పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగిస్తే వచ్చే ఆదాయంతో శాఖ అభివృద్ధి చేయవచ్చని జీవన్ రెడ్డి సూచించారు. ఇది ప్రజలకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News September 9, 2025

రాష్ట్రమంతా అరకు కాఫీ దుకాణాలే: మంత్రి సంధ్యారాణి

image

రాష్ట్రంలోని 175 నియోజక‌వ‌ర్గాల్లో అర‌కు కాఫీ షాప్‌లు పెట్టాల‌ని, ఉత్ప‌త్తుల‌ను అందుబాటులో ఉంచాల‌ని జీసీసీ అధికారుల‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. అర‌కు కాఫీ బ్రాండ్ ఇమేజ్‌ను ప్ర‌పంప వ్యాప్తి చేయ‌టంలో ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు చేపట్టాలన్నారు. ఉత్పత్తుల నిర్వహణ బేరిబోర పురుగు వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలు, అంశాలపై జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ చర్చించారు.

News September 9, 2025

అయిజ: హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం

image

అయిజ ZPHS హెచ్ఎంను సస్పెండ్ చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ MEO రాములును ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల సమయం కంటే విద్యార్థులు ముందుగా ఇంటికి వెళ్లడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వెళ్లారని హెచ్ఎంను ప్రశ్నించగా మాల పున్నమి కావడంతో ముందుగా వెళ్లారని సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్ సస్పెండ్ చేయాలని ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు.

News September 9, 2025

హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

image

1.హిమాలయ దేశం నేపాల్లో‌ నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.