News April 3, 2024

HYD: ఎమ్మెల్యేగా పోటీ చేసింది.. గంజాయి అమ్ముతూ అడ్డంగా చిక్కింది..

image

2023 ఎలక్షన్‌లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆసియాతస్నిం సుల్తానా గంజాయి అమ్ముతుండగా ఈరోజు అరెస్ట్ చేశామని HYD కంచన్‌బాగ్ పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని హాఫీజ్ బాబానగర్ సి బ్లాక్‌లో నివసించే ఆసియాతస్నిం సుల్తానా గత ఎలక్షన్‌లో చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీపై పోటీ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 7, 2024

HYDలో నమోదైన వర్షపాతం వివరాలు

image

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. మల్కాజిగిరిలో అత్యధికంగా 4.45 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మారేడ్‌పల్లిలో 2.85, సీతాఫల్‌మండిలో 2.43, కూకట్‌పల్లిలో 1.60, ఉప్పల్ 1.35 సెంటీమీటర్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 7, 2024

HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి

image

HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, మల్లారెడ్డి మనుమరాలు శ్రేయారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులున్నారు.

News October 6, 2024

HYD: రూ.100 కోట్ల అండర్ ట్యాంకుల నిర్మాణం

image

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.