News September 8, 2025
‘ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో’ పోస్టర్ ఆవిష్కరణ

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో-2025 పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఎక్స్‌పో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని నార్సింగ్‌లోని ఓం కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, లెన్స్‌లు, ప్రింటింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్లను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లకు మంచి అవకాశమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
Similar News
News September 9, 2025
సంగారెడ్డి: డిస్ట్రిక్ట్ డే కేర్ కేన్సర్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి

రాష్ట్రంలో 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డే కేర్ కేన్సర్ సెంటర్లను వర్చువల్‌గా సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా కేన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏటా 55 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మరో ఐదేండ్ల తర్వాత ఏటా 65 వేలకుపైగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని’ అన్నారు.
News September 9, 2025
మునిపల్లి: లింగంపల్లి పాఠశాలలో ప్రమాదం

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి పాఠశాలలో పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. శివానంద్ (ఇంటర్ మొదటి సంవత్సరం) తలకు గాయం కాగా, జ్ఞానేశ్వర్ (10వ తరగతి), అరవింద్ (6వ తరగతి) కూడా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులకు జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News September 9, 2025
4 దశల్లో స్థానిక ఎన్నికలు: SEC

APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.