News September 8, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ముడి పదార్థాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వేను పూర్తి చేయాలన్నారు.
Similar News
News September 9, 2025
JNTUHలో తెలంగాణ విద్యా కమిషన్ బృందం

తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం JNTUHను సందర్శించింది. యూనివర్సిటీ VC డా.టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా.కె. వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలోని పలు అంశాలుపై ప్రధానంగా చర్చించారు. విద్యా విధానాలు నాణ్యమైన విద్య, పరిశోధనపై దృష్టి సారించి సమగ్ర విద్యా విధానం రూపొందుతోందని మురళి తెలిపారు.
News September 9, 2025
ద్రావిడ వర్సిటీలో బి.టెక్ ప్రవేశాలకు దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో 2025-26 ఏడాదికి బి.టెక్ (Bachelor of Technology) కోర్సులలో మూడో విడత ప్రవేశాలకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. AP EAPCET-2025లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 11 అన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచన్నారు.
News September 9, 2025
నిర్మల్: రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతకు సన్మానం

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఇటీవల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో మామడ మండలం పోన్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మైస అరవింద్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. డీఈవో భోజన్న ఆయనను ఈరోజు శాలువాతో ఘనంగా సన్మానించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.