News April 3, 2024
పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్

హీరోయిన్ అంజలి తన పెళ్లి వార్తలపై స్పందించారు. తాను నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు మళ్లీ ఐదోసారి చేస్తున్నారు. నేను వివాహం చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు వార్తలు రాశారు. ఈ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. పెళ్లి చేసుకుంటా.. కానీ కొంత సమయం పడుతుంది’ అని ఆమె చెప్పారు.
Similar News
News January 12, 2026
BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
News January 12, 2026
మినుము పంట పూత, పిందె దశల్లో పల్లాకు తెగులు నివారణ ఎలా?

మినుములో పల్లాకు తెగులు లక్షణాలు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ముందుగా ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎకరాకు డైమిథోయేట్ 400ml లేదా థయోమిథాక్సాం 40గ్రా. లేదా అసిటామిప్రిడ్ 40 గ్రా. లేదా ఎసిఫేట్ 200 గ్రాములను 200 లీటర్ల నీటికి కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. దీంతో పాటు ఎకరానికి 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను అమర్చి ఈ తెగులును నియంత్రించవచ్చు.
News January 12, 2026
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: సీఎం

TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్‌లో ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు.


