News September 8, 2025
CPGET ఫలితాలు విడుదల

TG: రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల్లో MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన CPGET (Common Post Graduate Entrance Tests-2025) ఫలితాలు విడుదలయ్యాయి. <
Similar News
News September 10, 2025
మళ్లీ భారీ వర్షాలు

TG: నేటి నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలవనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News September 10, 2025
ఈ కారు ధర రూ.30 లక్షలు తగ్గింది

జీఎస్టీ కొత్త శ్లాబుల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మోడళ్లను బట్టి ఈ కారు ప్రైజ్ రూ.4.5లక్షల నుంచి రూ.30.4లక్షలు తగ్గడం విశేషం. అయితే రేంజ్ రోవర్ బేసిక్ మోడల్ రేటు రూ.2 కోట్లకు పైమాటే. ఇక ఇదే కంపెనీకి చెందిన డిఫెండర్‌పై రూ.7-రూ.18.60 లక్షలు, డిస్కవరీపై రూ.4.5-రూ.9.90 లక్షల మేర తగ్గింపు వర్తించనుంది.
News September 10, 2025
నేడు రక్షణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం, HYDలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. అనంతరం HYDకు తిరిగి వస్తారు.