News September 8, 2025
HYD: ఈ విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం: కవిత

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బీసీలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల కోసం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీ సంఘాలను కలుపుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
Similar News
News September 9, 2025
VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.
News September 9, 2025
మునిపల్లి: గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై ఎస్పీ పారితోష్ పంకజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ విద్యార్థులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రిలో పరామర్శించారు.
News September 9, 2025
సిర్పూర్: తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్: ఆర్ఎస్పీ

ముఖ్యమంత్రి తెలంగాణ రైసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ తెలంగాణ రైసింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ అన్నారు. మంగళవారం సిర్పూర్ మండలం చిన్నమాలిని గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి సీతక్క సిర్పూర్ రోడ్లను ఎందుకు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు.