News September 8, 2025

జనగామ కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ధర్నా

image

జనగామ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఈరోజు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 కూలి కల్పించాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.

Similar News

News September 9, 2025

వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయం: కలెక్టర్

image

ఒంగోలు నగర కార్పోరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో చొరవ తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు వ్యర్థాల నిర్వహణపై ఎంఓయూ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

News September 9, 2025

‘ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి’

image

అధికారులు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గ్రామ పాలన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్లస్టర్ల వారీగా నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. కేటాయించిన క్లస్టర్లలో రెవెన్యూ విధులు సక్రమంగా నిర్వహించి, ప్రభుత్వ భూముల సంరక్షణ, భూ భారతి చట్టం అమలులో సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు

News September 9, 2025

తెలుగు జాతికి నేడు చీకటి రోజు: షర్మిల

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి TDP, జనసేన, YCP మద్దతుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘తెలుగు జాతికి నేడు చీకటి రోజు. తెలుగు బిడ్డ(సుదర్శన్ రెడ్డి) పోటీ పడితే, RSS వాదికి ఓటు వేయించిన 3 పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. మత పిచ్చి మోదీకి మోకాళ్లు ఒత్తడమే వారి లక్ష్యం. BJPకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలి. కేసులకు భయపడి మోదీకి జగన్ దత్తపుత్రుడిగా అవతారం ఎత్తారు’ అని ట్వీట్ చేశారు.