News September 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.

Similar News

News September 10, 2025

ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడి దురదృష్టకరం: ట్రంప్

image

ఖతర్‌పై ఇజ్రాయెల్ <<17661181>>దాడి<<>> చేయడం దురదృష్టకరమని US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ‘ఇది ఇజ్రాయెల్ PM నెతన్యాహు నిర్ణయం. నాది కాదు. హమాస్‌ను అంతం చేయడం విలువైన లక్ష్యమే కానీ ఖతర్‌పై దాడి చేయడం వల్ల ఆ లక్ష్యం ముందుకు సాగదు. మళ్లీ ఇలాంటి దాడి జరగనివ్వను. ఈ యుద్ధం ముగిసిపోవాలి. నెతన్యాహు కూడా శాంతిని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. ఖతర్‌పై దాడికి ట్రంప్ మద్దతివ్వలేదని అంతకుముందు వైట్ హౌస్ ప్రకటించింది.

News September 10, 2025

శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

image

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

News September 10, 2025

ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల ధరలు ఇవే

image

ఐఫోన్ <<17663695>>17 సిరీస్<<>> మోడల్ ఫోన్లు ఈ నెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో వీటి ప్రారంభ ధరలు (256gb) ఇలా ఉన్నాయి.

ఐఫోన్ 17: ₹82,900
ఐఫోన్ 17 ఎయిర్: ₹1,19,900
ఐఫోన్ 17 ప్రో: ₹1,34,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్: ₹1,49,900