News September 8, 2025

ములుగు: వాట్సాప్ చాట్ బాట్ ద్వారా విద్యుత్ ఫిర్యాదులు

image

విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు డీఈ నాగేశ్వరరావు ఈరోజు తెలిపారు. వినియోగదారులు 7901628348 నంబర్‌కు హాయ్ పంపితే కంప్లైంట్ నమోదు, ట్రాక్, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలు పొందవచ్చన్నారు. కంప్లైంట్‌కు ప్రత్యేక ID సృష్టించి SMS ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. అదేవిధంగా 1912 టోల్ ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News September 10, 2025

టీ20 WC-2026 షెడ్యూల్ ఖరారు?

image

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక హోస్ట్ చేయనున్న ICC మెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు ESPNCricinfo పేర్కొంది. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 వేదికల్లో (భారత్‌లో 3, శ్రీలంక లో 2) నిర్వహించనున్నారు. పాకిస్థాన్ క్వాలిఫికేషన్‌ను బట్టి ఫైనల్‌ను అహ్మదాబాద్ లేదా కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం.

News September 10, 2025

ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడి దురదృష్టకరం: ట్రంప్

image

ఖతర్‌పై ఇజ్రాయెల్ <<17661181>>దాడి<<>> చేయడం దురదృష్టకరమని US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ‘ఇది ఇజ్రాయెల్ PM నెతన్యాహు నిర్ణయం. నాది కాదు. హమాస్‌ను అంతం చేయడం విలువైన లక్ష్యమే కానీ ఖతర్‌పై దాడి చేయడం వల్ల ఆ లక్ష్యం ముందుకు సాగదు. మళ్లీ ఇలాంటి దాడి జరగనివ్వను. ఈ యుద్ధం ముగిసిపోవాలి. నెతన్యాహు కూడా శాంతిని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. ఖతర్‌పై దాడికి ట్రంప్ మద్దతివ్వలేదని అంతకుముందు వైట్ హౌస్ ప్రకటించింది.

News September 10, 2025

శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

image

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.