News September 8, 2025

విశాఖ: సెప్టెంబర్ 10న స్థాయీ సంఘాల సమావేశం

image

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సెప్టెంబర్ 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో వి.సి.హాల్ సమావేశ మందిరంలో 1-7వ స్థాయీ సంఘాలు వేర్వేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.

Similar News

News September 9, 2025

ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ విజేత విజయవాడ బ్లాస్టర్స్

image

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రాయలసీమ రాణీస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.

News September 9, 2025

ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్‌ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించామన్నారు.

News September 9, 2025

జ్ఞానపురంలో అర్ధరాత్రి హల్చల్.. ఇంటి యజమానిపై దాడి

image

జ్ఞానపురంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు ఉంటున్న ఇంటి తలుపులు, కిటికీలు కొట్టడంతో వారు ఇంటి యజమానికి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ పీలా శ్రీనివాసరావు (55), తన కుమారుడు పూర్ణ సాయితో వెళ్లి ప్రశ్నించగా దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం CI రవి కుమార్ మంగళవారం తెలిపారు. నిందుతులు పాత నేరస్తులైన దేవర కళ్యాణ్, దుర్గా ప్రసాద్‌గా గురించారు.