News September 8, 2025
SRD: అమ్మ ఒడికి గణపయ్యా.. తాము తక్కువేం కాదయ్యా!

ఈ సృష్టికి జన్మ స్వరూపం స్త్రీ. అలాంటి మహిళలు ఏకమై గణనాథుడికి ప్రతిష్ఠించారు. మొదటి పూజ నుంచి చివరి రోజు వరకు వినాయకుడికి పూజ చేశారు. నిమజ్జన కార్యక్రమంలో కోలాటం వేస్తూ ఊరేగించారు. చివరకు గణపయ్యను ఆ గంగమ్మ ఒడిలోకి చేర్చించారు. రామచంద్రపురంలోని మహిళలు చేసిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. మగవారికి తాము తక్కువేం కాదు అని నిరూపించారు.
Similar News
News September 9, 2025
జగిత్యాల: జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం పూడూర్లో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యంపై ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాల గురించి రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తదితరులు ఉన్నారు.
News September 9, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక (మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News September 9, 2025
CPGETలో జగిత్యాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని సయ్యద్ ఫలక్ CPGET– 2025(కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్)లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. హిందీ విభాగానికి చెందిన ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమెను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్, హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్, తదితర అధ్యాపకులు అభినందించారు.