News September 8, 2025
మంచిర్యాల: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్

మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ, ఇతర పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకై పోరాటం చేస్తామని రఘునాథ్ పేర్కొన్నారు. రఘునాథ్ నియామకంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News September 9, 2025
రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి: ఆదిలాబాద్ కలెక్టర్

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 10న అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కావున రిమ్స్ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించే వర్ధంతి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ, రజక సంఘాల నాయకులు, ప్రజలు హాజరవ్వాలని కోరారు.
News September 9, 2025
మూడు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 9, 2025
గద్దెల మార్పు నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మేడారం పూజారులు

TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.