News September 8, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: KMR కలెక్టర్

జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, రేషన్ కార్డు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జీపీఓలకు మంగళవారం లోగా గ్రామాలు కేటాయిస్తామని తెలిపారు.
Similar News
News September 10, 2025
ఆరు గోదాంలు సిద్ధం: DRDA విద్యాచందన

కొత్తగూడెం జిల్లాకు రానున్న ఇందిరమ్మ చీరలను నిల్వ చేయడానికి 6 గోదాంలను సిద్ధం చేసినట్లు DRDA ఎం.విద్యాచందన తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఈ గోదాంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఒక్కో గోదాంలో 30 వేల నుంచి 60 వేల వరకు చీరలను నిల్వ చేయనున్నామని ఆమె వెల్లడించారు.
News September 10, 2025
iPHONE 17 PRO: అమెరికాలో మనకంటే రూ.38వేలు తక్కువ!

ఐఫోన్ 17 సిరీస్ వివరాలు రివీల్ అవడంతో తొలిరోజే కొనేందుకు కొనుగోలుదారులు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇండియాతో పోల్చితే అమెరికాలో తక్కువ ధరలు ఉన్నాయి. ఐఫోన్ 17 PRO సిరీస్ ఫోన్లు ఇండియాలో ₹1,34,900 ఉండగా USAలో ₹96,870($1099), UAEలో ₹1,12,923 (AED 4,699), జపాన్‌లో ₹1,07,564లకు లభిస్తుంది. అయితే ఇండియాలోనే ఉత్పత్తి జరుగుతున్నా ధరల్లో ఎందుకింత వ్యత్యాసం ఉంటుందనే చర్చ జరుగుతోంది.
News September 10, 2025
రేపు అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో కురుష్, పెదకాకాని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్చరీ, పల్నాడు జిల్లా నందిగామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెపక్ తక్ర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు సంబంధిత స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు