News September 8, 2025

YCP ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: అయ్యన్న

image

AP: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇస్తామన్నారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూరియాపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. యూరియాపైనే కాదు మిగతా అన్ని సమస్యలపైనా చర్చిద్దాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Similar News

News September 10, 2025

మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్

image

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ‘వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ట్రేడ్ విషయంలో రెండు గొప్ప దేశాలు సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

News September 10, 2025

‘ఇందిరమ్మ ఇళ్ల’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. HYD హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. 18005995991 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.

News September 10, 2025

టీ20 WC-2026 షెడ్యూల్ ఖరారు?

image

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక హోస్ట్ చేయనున్న ICC మెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు ESPNCricinfo పేర్కొంది. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 వేదికల్లో (భారత్‌లో 3, శ్రీలంక లో 2) నిర్వహించనున్నారు. పాకిస్థాన్ క్వాలిఫికేషన్‌ను బట్టి ఫైనల్‌ను అహ్మదాబాద్ లేదా కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం.