News September 8, 2025
శ్రీదేవి తన గదికి రానిచ్చేది కాదు: బోనీ కపూర్

‘మామ్’ మూవీ షూటింగ్ సమయంలో శ్రీదేవి తన గదికి అస్సలు రానిచ్చేది కాదని ఆమె భర్త బోనీ కపూర్ తెలిపారు. ఆ పాత్ర పట్ల ఆమె ఎంత నిబద్ధతతో పనిచేసిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. ‘ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. రెమ్యునరేషన్ ఎక్కువ అని వద్దనుకున్నాం. కానీ శ్రీదేవి తన పారితోషికం రూ.70 లక్షలు ఇచ్చి ఆయనను తీసుకురావాలని చెప్పారు’ అని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Similar News
News September 10, 2025
టీ20 WC-2026 షెడ్యూల్ ఖరారు?

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక హోస్ట్ చేయనున్న ICC మెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు ESPNCricinfo పేర్కొంది. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 వేదికల్లో (భారత్‌లో 3, శ్రీలంక లో 2) నిర్వహించనున్నారు. పాకిస్థాన్ క్వాలిఫికేషన్‌ను బట్టి ఫైనల్‌ను అహ్మదాబాద్ లేదా కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం.
News September 10, 2025
ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడి దురదృష్టకరం: ట్రంప్

ఖతర్‌పై ఇజ్రాయెల్ <<17661181>>దాడి<<>> చేయడం దురదృష్టకరమని US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ‘ఇది ఇజ్రాయెల్ PM నెతన్యాహు నిర్ణయం. నాది కాదు. హమాస్‌ను అంతం చేయడం విలువైన లక్ష్యమే కానీ ఖతర్‌పై దాడి చేయడం వల్ల ఆ లక్ష్యం ముందుకు సాగదు. మళ్లీ ఇలాంటి దాడి జరగనివ్వను. ఈ యుద్ధం ముగిసిపోవాలి. నెతన్యాహు కూడా శాంతిని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. ఖతర్‌పై దాడికి ట్రంప్ మద్దతివ్వలేదని అంతకుముందు వైట్ హౌస్ ప్రకటించింది.
News September 10, 2025
శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.