News April 3, 2024
విచిత్రం.. తలపై కొమ్ముతో ‘జంతు మనిషి’

MP భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి జంతువులాగా తలపై కొమ్ము పెరుగుతోంది. దీంతో ఆయన్ను ‘జంతు మనిషి’ అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాగర్ జిల్లాలోని రహ్లి గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ యాదవ్ తలకు 2014లో గాయమైంది. కొన్ని రోజులకు తలపై వింతగా చర్మం పెరగడాన్ని గమనించి కత్తిరిస్తూ వస్తున్నాడు. మరింత వేగంగా పెరగడంతో వైద్యులను సంప్రదించగా.. ఇది అరుదైన చర్మవ్యాధని, క్యాన్సర్‌కు సంకేతమని తెలిపారు.
Similar News
News March 22, 2026
ఈ గ్రామంలో వర్షమే కురవదు!

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 22, 2026
యుద్ధంతో పర్యావరణానికీ భారీ విధ్వంసం

పశ్చిమాసియాలో యుద్ధం పర్యావరణాన్నీ నాశనం చేస్తోంది. 2 వారాల్లో 5 మి. టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు(CO2, CH4, N20) విడుదలైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇరాన్‌లో 20K భవనాలు దెబ్బతినడంతో 2.4M టన్నుల CO2 రిలీజైంది. 2.5-5.9మి. బ్యారెళ్ల చమురు ధ్వంసమవడంతో 1.88M టన్నుల C02 గాల్లో కలిసింది. దేశాలు వాడిన ఇంధనం, కోల్పోయిన జెట్స్, డ్రోన్లు, క్షిపణుల వల్ల కూడా విష పదార్థాలు విడుదలయ్యాయి’ అని తెలిపింది.
News March 22, 2026
ఈ జిల్లాల్లో రేపు పిడుగులతో వర్షాలు!

AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంది. ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని సూచించింది.


