News September 8, 2025

ఢిల్లీలో రేవంత్

image

TG: ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రేపు ఉ.10 గం. నుంచి సా.5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు. అటు రేవంత్ రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై వినతిపత్రాలు ఇస్తారని తెలుస్తోంది. యూరియా కొరత, ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని వారికి వివరించనున్నారు.

Similar News

News September 9, 2025

వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

image

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

News September 9, 2025

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

image

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-చాందీపూర్‌‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/

News September 9, 2025

రేపటి నుంచే పీఈసెట్ కౌన్సెలింగ్

image

AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.