News September 8, 2025

GWL: సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి- SP

image

సైబర్ వారియర్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో DSP మొగిలయ్యతో సైబర్ వారియర్స్, D4C సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లా సైబర్ సెల్‌తో సమన్వయం చేసుకొని సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద కంటెంట్‌పై నిఘా ఉంచాలని, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటెలిజెన్స్ సేకరణ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

Similar News

News September 10, 2025

కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని ఆయన చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

News September 10, 2025

విజయవాడ: టెక్నాలజీ ఎక్కువ.. పోలీసులు తక్కువ..!

image

విజయవాడలో దసరా ఉత్సవాల సందర్భంగా సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, గత ఏడాది కంటే తక్కువ సిబ్బందితోనే, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బందోబస్తు నిర్వహించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. డ్రోన్లు, ఏఐ సాంకేతికత, సీసీ కెమెరాల ద్వారా భక్తుల క్యూ లైన్లు, ట్రాఫిక్‌ను పర్యవేక్షించనున్నారు. సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీసులు దీనిపై శిక్షణ పొందారు.

News September 10, 2025

గద్వాల: సైబర్ ఉచ్చు.. చదువుకున్నవారే బలైపోతున్నారు!

image

పని చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నవారు సైబర్ మోసగాళ్లకు సులభ లక్ష్యాలు అవుతున్నారు. తాజాగా గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వాసి ట్రేడింగ్‌లో లాభాల పేరుతో రూ.22 లక్షలు, వడ్డేపల్లి వాసి రూ.8 లక్షలు కోల్పోయారు. చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారని పోలీసులే చెబుతున్నారు. విశ్వసనీయత లేకుండా అనుమానాస్పద యాప్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టడం.. తమకు తెలియకుండానే మోసాలకు బలవుతున్నారు.