News September 8, 2025
GWL: గ్రీవెన్స్ డే కు 14 ఫిర్యాదులు: ఎస్పీ

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 14 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అట్టి ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత ఎస్ఐ లకు సూచించారు. భూ వివాదాలకు సంబంధించి 5, గొడవలకు సంబంధించి 2, ప్లాట్లకు సంబంధించి 3, పొలం బాటకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 3, మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు. డీఎస్పీ, సిఐలు పాల్గొన్నారు.
Similar News
News September 10, 2025
ఫేక్ వీడియోలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి: ఆకే. రవికృష్ణ

సీఎం చంద్రబాబు రైతులకు యూరియా, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించాలన్న సూచనలను వక్రీకరించి డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘CBN warning to farmers’ పేరుతో వస్తున్న ఫేక్ వీడియోపై CID కేసు నమోదు. సైబర్ క్రైమ్స్ ఐజీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయడం నేరమేనని, అలాంటి వీడియోలపై 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
News September 10, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లు, బస్సులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాలు, అసాంఘిక శక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News September 10, 2025
భద్రాద్రి: నేడు, రేపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు సెలవు

దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్‌పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి గెలలు యథావిధిగా కొంటామని, రైతులు సహకరించాలని కోరారు.