News September 9, 2025

జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు

image

జనగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. అనేక రకాల వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో పనిచేస్తుందని, ప్రజలు తప్పనిసరిగా ఫిజియోథెరపిస్టుల సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎం & హెచ్ఓ మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2025

అద్దంకిలో ఆరోజు ఏం జరిగింది?

image

సెప్టెంబర్ 9, 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు కార్యకర్తలు నిర్వహించిన రాస్తారోకో ఫోటోలను టీడీపీ నేతలు SMలో షేర్ చేశారు.

News September 10, 2025

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేనూ ఎదురుచూస్తున్నా: PM మోదీ

image

తనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్న <<17663735>>ట్రంప్<<>> వ్యాఖ్యలకు PM మోదీ బదులిచ్చారు. తానూ ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన IND, US మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయని, IND-US భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.

News September 10, 2025

గేట్‌కు దరఖాస్తు చేశారా?

image

<>GATE<<>>-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి 30 సబ్జెక్టులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు సెప్టెంబర్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మంచి స్కోరు సాధిస్తే IIT, NIT, IISC వంటి ఇన్‌స్టిట్యూట్లలో ఎంటెక్/ఎంఈ/పీహెచ్‌డీల్లో చేరవచ్చు.