News September 9, 2025

అల్లు అర్జున్‌కి షాక్.. నోటీసులు ఇచ్చిన GHMC

image

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనం మీద అదనపు అంతస్తు నిర్మించారంటూ GHMC అధికారులు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. అనుమతి లేకుండా నిర్మించిన ఐదో అంతస్తు ఎందుకు కూల్చోద్దంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంపైన ఇటీవల అక్రమంగా నిర్మించిన విషయంపై ఫిర్యాదు రావడంతో అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News September 9, 2025

HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

image

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

News September 9, 2025

నార్సింగిలో ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి

image

నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మనిహరీక రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేయడానికి రూ.10 లక్ష డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ రూ.4 లక్షలు తీసుకుంటుండగా మనిహారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 9, 2025

HYD: అలా అయితే.. నిజంగా ఇది ‘భాగ్య’నగరమే.. !

image

మహానగర విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తోంది. 2050 నాటికి 31 రూట్లలో 662 KM మెట్రో రైళ్లు నడపాలని ముసాయిదా సిద్ధమైంది. నిజంగా ఇది అమలైతే.. నగర వాసికి ట్రాఫిక్ చిక్కులు తప్పినట్టే. త్వరలో 200 కిలోమీటర్లు, భవిష్యత్తులో 662 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తే నిజంగా ఇది ‘భాగ్య’నగరమే అవుతుంది.