News September 9, 2025
వరంగల్: బెట్టింగ్‌ల కోసమే కిడ్నాప్ డ్రామా..!

వరంగల్‌లో జరిగిన <<17653755>>కిడ్నాప్ డ్రామా<<>> సుఖాంతమైంది. పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్ వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటున్న యువకుడే తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడాడు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టి డ్రామాకు తెరదించారు. ఆన్‌లైన్ బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకొని అప్పులపాలైన యువకుడి ఆట కట్టించారు.
Similar News
News September 10, 2025
MNCL: చచ్చిపోవటం తప్పు సోదరా..!

MNCL జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. చిన్నపాటి సమస్యకు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. చిన్న సమస్యలకే యువత నుంచి వృద్ధుల వరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2023లో 414, 2024లో 418, ఈ ఏడాది ఇప్పటి వరకు 275 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News September 10, 2025
అనంతపురం సభకు లోకేశ్ దూరం

AP: అనంతపురంలో ఇవాళ జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభకు మంత్రి నారా లోకేశ్ గైర్హాజరు కానున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దీంతో లోకేశ్ వెలగపూడిలోని సచివాలయంలో కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఏపీ వాసులను క్షేమంగా రప్పించేందుకు కేంద్ర మంత్రులు, అధికారులతో సమన్వయం చేయనున్నారు.
News September 10, 2025
మొగిలిచెర్ల శిల్పాలు ఏకవీర దేవి ఆలయానికి తరలింపు

WGL నగరానికి చెందిన 31 పురాతన శిల్పాలను మొగిలిచెర్ల గ్రామం నుంచి ఏకవీరదేవి ఆలయానికి తరలించారు. GWMC అధికారులు 2 రోజులుగా ఎంతో జాగ్రత్తగా ఈ శిల్పాలను తరలించి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఈ చర్య వల్ల విలువైన మన సాంస్కృతిక వారసత్వం సంరక్షణలోకి రావడంతో పాటు, ప్రజలు వాటిని దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. మన చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే ఈ శిల్పాల పరిరక్షణలో GWMC సిబ్బంది కృషిని అభినందించారు.