News September 9, 2025

భూపాలపల్లి జిల్లాలో సోమవారం ముచ్చట్లు

image

✓ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ కిరణ్ ఖరే 
✓ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పోలీసుల లాఠీఛార్జ్
✓ భూపాలపల్లిలో అదనంగా 16 ఎరువు విక్రయ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్
✓ అన్నారం బ్యారేజీలో పడి ఒకరి గల్లంతు
✓ యూరియా కోసం జిల్లా వ్యాప్తంగా రైతుల ఇబ్బందులు
✓ మహిళలు వేధింపులకు భయపడొద్దు: సివిల్ జడ్జి అఖిల

Similar News

News September 9, 2025

జైత్రయాత్రకు ముందు నుంచే జగిత్యాలతో గద్దర్‌కు అనుబంధం

image

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్‌ జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వెల్గటూరు, బీర్‌పూర్‌, సారంగపూర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. మలిదశ ఉద్యమంలో ధూంధాం పేరిట పలు బహిరంగ సభలకు గద్దర్‌ హాజరై పాటలు పాడి ప్రసంగించారు. పలుసార్లు జగిత్యాలకు వచ్చిన గద్దర్‌ జైత్రయాత్రకు కేంద్రమైన జగిత్యాలను మరిచిపోలేనని భూమాతను ముద్దాడి, జగిత్యాల ఉద్యమ మట్టిని మూటగట్టి గద్దర్‌ వెంట తీసుకెళ్లాడు.

News September 9, 2025

మావోయిస్టు ఉద్యమాలకు ఊపిరందించిన జగిత్యాల జైత్రయాత్ర

image

జగిత్యాల జైత్రయాత్రతో రైతు కూలీ సంఘాలు పీపుల్స్‌వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి భీజం వేసింది. ఈ జైత్రయాత్ర వేదికపై మావోయిస్టు అగ్రనేతలు గణపతి, కిషన్‌ జీ, శీలం నరేశ్‌, కైరి గంగారం, గజ్జెల గంగారం, అంగ ఓదెలు, గద్దర్‌తో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. నాటి ఈ జైత్రయాత్ర నిర్వాహకులు ఎన్‌కౌంటర్‌లు, లొంగిపోవడం, ఇంకొందరు అడవిబాట పట్టారని మాజీలు చెబుతారు.

News September 9, 2025

వెట్టిచాకిరి పోరాటమే జగిత్యాల జైత్రయాత్రకు పునాది

image

గ్రామాల్లో భూస్వాములు, పటేల్ పట్వారిలు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకునేవారు. ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన యువకులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచి రైతుకూలీ సంఘాలను ఏర్పాటు చేశారు. ‘వెట్టిచాకిరి నిర్మూలన, పాలేరుకు జీతాలు పెంపు, దున్నేవాడిదే భూమి’ అంటూ వారిలో చైతన్యం రగిలించి వెట్టిచాకిరి బంద్ పెట్టించారు. వీటి విముక్తి కోసమే1979, Sep9న జగిత్యాల జైత్రయాత్ర పురుడు పోసుకుంది.