News April 4, 2024
ADB: పాఠశాల మౌలిక సదుపాయాల అంచనాలు పూర్తి చేయాలి: కలెక్టర్

అమ్మ ఆదర్శ- పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల అంచనాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో పాఠశాలల్లోని 5రకాల పనులకు సంబంధించి వాటిపనుల అంచనాలను సంబంధిత అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలన్నారు.
Similar News
News March 14, 2026
ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
News March 14, 2026
భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.