News April 4, 2024

NZB: రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం యువతే: సీపీ

image

యువత మద్యం తాగి వాహనాలు నడపరాదని, గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలలో యువతే అత్యధికంగా ఉన్నారని నిజమాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం పేర్కొన్నారు. కాగా 2023లో మొత్తం 767 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 337మంది మరణించారు. మార్చ్(2024)నెలలో 649 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 267మందికి జైలుశిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ సూచించారు.

Similar News

News March 22, 2026

నిజామాబాద్: భగ్గుమంటున్న మాంసం ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో రూ.320, స్కిన్‌లెస్ రూ.358కి చేరింది. మటన్ ధరలు సైతం పైపైకి వెళ్తున్నాయి. సాధారణ మేక మాంసం రూ.500-600 పలుకుతుండగా, పొట్టేలు మాంసం రూ.800 నుంచ రూ.900 వరకు విక్రయిస్తున్నారు. వేసవి ఎండల ప్రభావం, శుభకార్యాల వల్ల పెరిగిన డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.

News March 22, 2026

NZB: నేడు ప్రపంచ జల దినోత్సవం.. మీరేం చేయాలంటే?

image

“నీరు లేనిదే జీవం లేదు.. నీటిని పొదుపుగా వాడటం మనందరి బాధ్యత” అనే నినాదంతో నేడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహించనున్నారు. కురుస్తున్న వర్షాలు, ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి పథకాల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు గతంలో కంటే కొంత మెరుగయ్యాయి. అయినప్పటికీ “ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడడంతో పాటు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకోవడం, బావులను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.

News March 21, 2026

ఏర్గట్ల: చిట్టి చేతులు..చక్కని కవితలు

image

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం