News September 9, 2025
శుభ సమయం (9-09-2025) మంగళవారం

✒ తిథి: బహుళ విదియ రా.8.31 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.9.05 వరకు
✒ శుభ సమయములు: ఉ.6.00-ఉ.8.00, సా.4.10-సా.5.10
✒ రాహుకాలం: మ.3.30-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: ఉ.7.23-ఉ.8.54
✒ అమృత ఘడియలు: సా.4.26-సా.5.58
Similar News
News September 9, 2025
రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల బిడ్డకు ఆయన ఆశీస్సులు అందజేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ కుమారుడికి ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. 2017లో రామ్మోహన్, శ్రావ్య వివాహం చేసుకోగా 2021లో కూతురు(శివంకృతి) జన్మించింది. నెల క్రితం బాబు పుట్టాడు.
News September 9, 2025
BREAKING: నేపాల్ ప్రధాని రాజీనామా

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. <<17648801>>ఉద్రిక్త పరిస్థితుల<<>> నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.
News September 9, 2025
హనుమంతుడి విగ్రహాలు నారింజ రంగులో ఎందుకు?

హనుమంతుడు భక్తి తత్పరుడు. ఆయన విగ్రహాలు, జెండా అన్ని నారింజ రంగులోనే దర్శనమిస్తాయి. ఓరోజు సీతాదేవి నుదుటన ఆంజనేయుడు కుంకుమను గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని అడిగాడు. అప్పుడు జానకీ దేవి ఆ సిందూరం శ్రీరాముని దీర్ఘాయువుని సూచిస్తుందని చెప్పింది. దీంతో హనుమంతుడు కూడా రాముడిపై అంతులేని ప్రేమతో తన దేహమంతటా ఆ సిందూరాన్ని పూసుకున్నాడు.