News September 9, 2025

కరాటే పోటీల్లో రాయికల్ విద్యార్థులకు ‘GOLD’

image

కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాయికల్ ఎస్సై సుధీర్ రావు అన్నారు. కరీంనగర్లో జరిగిన 3వ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ కుంగ్ ఫూ అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో రాయికల్‌కు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరికి ఎస్సై పతకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కరాటే మాస్టర్ ప్రభాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Similar News

News September 9, 2025

HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

image

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

News September 9, 2025

మంచిర్యాల: 11న మినీ జాబ్ మేళా

image

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. హైదారాబాద్‌లోని హెటేరో కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్, 100 జూనియర్ కెమిస్ట్ ట్రైనీ, 60 జూనియర్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 9, 2025

RGM: పోలీస్‌ అధికారులపై విచారణ

image

పోలీసు అధికారుల పనితీరుపై రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. DJ సౌండ్స్ విషయంలో ఒకరిని, చోరీ విషయంలో మరొకరిని బెదిరింపులకు గురిచేసిన బసంత్ నగర్ SI, గణేష్ నిమజ్జనం రోజున ఓ డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించిన చెన్నూరు రూరల్ CIలపై ఎంక్వైరీపై CP అంబర్‌ కిషోర్‌ ఝా ప్రత్యేకంగా దృష్టి సారించారు.