News April 4, 2024
పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్

అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన విధుల అనుభవంతో లోక్ సభ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేలా, అత్యధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజున కూల్ వాటర్, ప్రతి పోలింగ్ గదిలో నాలుగు ఫ్యాన్లు, బయట షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Similar News
News March 29, 2026
ఖమ్మం: ఆటో బోల్తా.. ఆరుగురు చిన్నారులకు గాయాలు

సింగరేణి(M) జమాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేరపల్లికి చెందిన వజ్రా సునీల్ ఆరుగురు చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని ఇల్లందు వెళ్తుండగా, చామలపల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2026
ఖమ్మం రోడ్లకు మహర్దశ: ₹1,227 కోట్లతో ‘హ్యామ్’ హంగులు!

ఖమ్మం జిల్లాలో రోడ్ల ఆధునికీకరణకు ప్రభుత్వం ₹1,227.13 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా ‘హ్యామ్’ (HAM) విధానంలో ఐదు నియోజకవర్గాల్లో 426 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నారు. ఈ పద్ధతిలో కాంట్రాక్టరే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉండటంతో పనుల్లో నాణ్యత పెరగనుంది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.