News September 9, 2025

సంగారెడ్డి: 12న ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాల బాలికల అండర్-19 ఫుట్ బాల్ పోటీలు ఈనెల 12న మెదక్ ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతాయని సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం సోమవారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పదోతరగతి మెమో, బోనాపైడ్, జన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 94486 86408, 99483 21330 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Similar News

News September 9, 2025

MGMలో ప్రారంభమైన కాన్సర్ కేర్ సెంటర్

image

వరంగల్ ఎంజైమ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పది పడకల జిల్లా కాన్సర్ కేర్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనరసింహ వర్చువల్‌గా నేడు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్ చికిత్సను సమీప ప్రాంతంలోనే అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News September 9, 2025

JNTUHలో తెలంగాణ విద్యా కమిషన్ బృందం

image

తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం JNTUHను సందర్శించింది. యూనివర్సిటీ VC డా.టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా.కె. వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలోని పలు అంశాలుపై ప్రధానంగా చర్చించారు. విద్యా విధానాలు నాణ్యమైన విద్య, పరిశోధనపై దృష్టి సారించి సమగ్ర విద్యా విధానం రూపొందుతోందని మురళి తెలిపారు.

News September 9, 2025

ద్రావిడ వర్సిటీలో బి.టెక్ ప్రవేశాలకు దరఖాస్తులు

image

ద్రావిడ వర్సిటీలో 2025-26 ఏడాదికి బి.టెక్ (Bachelor of Technology) కోర్సులలో మూడో విడత ప్రవేశాలకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. AP EAPCET-2025లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 11 అన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచన్నారు.