News September 9, 2025

ఏది కొనాలన్నా 22 తర్వాతే..

image

ఈనెల 22 తర్వాత GST కొత్త <<17605492>>శ్లాబులు<<>> అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో ‘ఏది కొనాలన్నా ఆ తర్వాతే’ అని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST పూర్తిగా ఎత్తేయడంతో ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా 22 తర్వాతే ఆఫర్లను అమలు చేయనున్నాయి.

Similar News

News September 9, 2025

బ్రెవిస్ జాక్‌పాట్.. ఏకంగా రూ.8 కోట్లు

image

సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్‌పాట్ కొట్టారు. SA20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీగా గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం IPLలో చెన్నై తరఫున ఆడుతున్నారు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడుగు దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది.

News September 9, 2025

మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.

News September 9, 2025

గద్దెల మార్పు నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మేడారం పూజారులు

image

TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.