News September 9, 2025
మద్దికేరలో సచివాలయ ఉద్యోగుల ప్రేమ పెళ్లి

మద్దికేర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో బొమ్మనపల్లి సచివాలయ పంచాయతీ సెక్రటరీ మంజునాథ్, సచివాలయం-3 మహిళా పోలీస్ రాజేశ్వరి సోమవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్ల నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. చివరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒక్కటయ్యారు.
Similar News
News September 9, 2025
ప్రకాశంకు 3 రోజులు వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA ప్రకటించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. గత 3 రోజులుగా తీవ్ర వేడిమిలో బాధపడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు. అయితే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News September 9, 2025
ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై కమిటీ: SEC సాహ్ని

AP: ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని SEC నీలం సాహ్ని తెలిపారు. ‘S-3 మోడల్ ఈవీఎంలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. 10,670 M-2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మనవద్ద ఉన్నాయి. ఒకవేళ ఈవీఎంలు అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
News September 9, 2025
బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.