News September 9, 2025
ఇక నుంచి గిరిజనులకూ 14.2 కేజీల సిలిండర్లు

AP: రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఇక నుంచి 14.2 కేజీల LPG సిలిండర్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘దీపం-2’ పథకం కింద ప్రస్తుతం 5Kgs సిలిండర్లను ఇస్తుండగా, వాటి స్థానంలో 14.2Kgs సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంటేషన్ ఛార్జీల కోసం ₹5.54Cr కేటాయించింది. ఈ నిర్ణయంతో 23,912 మందికి లబ్ధి చేకూరనుంది.
Similar News
News September 9, 2025
తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.
News September 9, 2025
ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. ‘ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా’ అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.
News September 9, 2025
ప్చ్.. ఓటేయడం రాని నేతలను ఎన్నుకున్నాం!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 మంది MPల <<17659975>>ఓట్లు<<>> చెల్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకే ఓటు వేయరాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకొని ఏం లాభమని అంటున్నారు. ఈ 15 ఓట్లతో ఫలితం మారకున్నా మెజార్టీపై ప్రభావం పడేది. గతంలో TGలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భారీగా గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్?