News September 9, 2025

కాపీరైట్ కేసు.. ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు!

image

వరుస కాపీ రైట్ కేసులతో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన పర్మిషన్ లేకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో తాను కంపోజ్ చేసిన సాంగ్స్ వాడారని ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ప్రసారాన్ని ఆపాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను ఆదేశించింది. గతంలో ‘మంజుమ్మల్ బాయ్స్’, ఇటీవల ‘కూలీ’ చిత్రాలపై కూడా ఆయన కేసు వేశారు.

Similar News

News September 9, 2025

10 పోస్టులకు APPSC నోటిఫికేషన్

image

AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 9, 2025

తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

image

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్‌ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.

News September 9, 2025

ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి

image

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. ‘ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా’ అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.